సమంత చేతుల మీదుగా ‘చిలసౌ’..?

10 Jul, 2018 18:30 IST|Sakshi

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్‌. కాళిదాసు సినిమాతో వెండితెరకు పరిచయమై సక్సెస్‌ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్‌లో ‘కరెంట్‌’ సినిమా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ మూవీ విజయం సాధించలేదు.

సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్‌కు చిలసౌ సినిమాతో విజయం వరించబోతున్నట్లే కనిపిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చి మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేసేందుకు జూలై 11న సాయంత్రం ఆరు గంటలకు పెళ్లి కూతురు (రుహాని శర్మ)కు సంబంధించిన టీజర్‌ను సమంత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్‌. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు