బన్సాలీ సినిమాగా మరో చారిత్రక ప్రేమకథ

10 May, 2016 12:35 IST|Sakshi
బన్సాలీ సినిమాగా మరో చారిత్రక ప్రేమకథ

రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా విషాదాంత ప్రేమకథలను భారీగా తెరకెక్కించే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. దేవదాస్, రామ్ లీలా లాంటి ప్రేమకథలను తెరకెక్కించిన బన్సాలీ తన తాజా చిత్రం  బాజీరావ్ మస్థానీతో జాతీయ అవార్డును సైతం సాధించాడు. తన ప్రతీ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే బన్సాలీ మరో చారిత్రక ప్రేమకథకు వెండితెర రూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అల్లావుద్దీన్ ఖిల్జీ జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు బన్సాలీ. 1296 నుంచి 1316 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, మేవార్ రాణి పద్మావతిని ప్రేమించాడు. ఈ ప్రేమకథనే నెక్ట్స్ సినిమాకు కథగా తీసుకున్నాడు బన్సాలీ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయడనికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక జరగనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా