మరైందిరుందు పార్కుంమర్మమెన్నకు సెన్సార్‌ కష్టాలు

3 Aug, 2017 04:10 IST|Sakshi
మరైందిరుందు పార్కుంమర్మమెన్నకు సెన్సార్‌ కష్టాలు

తమిళసినిమా: మరైదిరుందు పార్కుం మర్మమెన్న చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సెన్సార్‌బోర్డు నిరాకరించింది. ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై వి.మదిఅళగన్, ఆర్‌.రమ్య నిర్మించిన చిత్రం మరైంది రుందు పార్కుంమర్మమెన్న. తిలగర్‌ చిత్రం ఫేమ్‌ ధ్రువకథానాయకుడిగా నటించిన ఇందులో ఐశ్వర్యదత్త, అంజన కథానాయికలుగా నటించారు. జేడీ.చక్రవర్తి, శరణ్యపొన్‌వన్నన్, రా ధారవి, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాకేష్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మంగళవారం సెన్సార్‌బోర్డు సభ్యులకు ప్రదర్శించారు.

సెన్సార్‌బృందం ఈ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారట. దీని గురించి దర్శకుడు రాకేష్‌ తెలుపుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి తెరపై ఆవిష్కరించిన చిత్రం మరైం దిరుంది పార్కుం మర్మమెన్న అని తెలిపారు. మహిళలు, పిల్లలు ఎలా బాధింపునకు గురవుతున్నారన్న విషయాల గురించి అవగాహన కలిగించే విధంగా ఈ చిత్రాన్ని రూపొం దించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు నిత్యం పత్రికల్లో, ప్రసార సాధనాల్లో చూస్తున్నామన్నారు. వాటి గురించి పట్టించుకోని సెన్సార్‌బోర్డు సభ్యులు తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించి రివైజింగ్‌ కమిటీకి వెళ్లమనడం ఎంత మాత్రం సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు.

>