అవన్నీ కథలో భాగమే

4 Jun, 2019 03:11 IST|Sakshi
నిజార్‌ షఫీ

‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్‌ షఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సెవెన్‌’ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా మారారు. హవీష్‌ హీరోగా రమేష్‌ వర్మ ప్రొడక్ష¯Œ లో రమేష్‌ వర్మ నిర్మించారు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ 5న చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిజార్‌ షఫీ మాట్లాడుతూ – ‘‘ఎంజీఆర్‌ గవర్నమెంట్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజ¯Œ  ట్రైనింగ్‌ ఇ¯Œ స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ చేశా. కోర్స్‌ పూర్తయిన తర్వాత శక్తీ శరవణన్‌గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్‌’గా విడుదలైన అజిత్‌ సినిమాలకు అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా.

రజనీకాంత్‌ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ఒక రోజు హవీష్‌ ఫోన్‌ చేసి, ‘మంచి లైన్‌ విన్నాను. డైరెక్షన్‌ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్‌ నచ్చింది. రమేష్‌ వర్మగారితో కలిసి డెవలప్‌ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్‌ చేసుకోవాలని దర్శకుడిగా ఓకే చెప్పేశా. ఇదొక రొమాంటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. సినిమాలో లిప్‌ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్‌ కొంచెం ఆలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్‌లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు కమిట్‌ అయ్యాను. దర్శకుడిగా రెండు స్టోరీ లైన్స్‌ అనుకున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు