క్రేజీ కాంబినేషన్‌

26 Jul, 2018 01:32 IST|Sakshi
ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక

ఒకరేమో క్రేజ్‌లో ఉన్న హీరో తమ్ముడు, మరొకరేమో స్టార్‌ కిడ్‌. అది మాత్రమే కాదు.. తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న హీరోయిన్‌ చెల్లెలు. ఇప్పుడు వీళ్లిద్దరి జోడీ కుదిరింది. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, జీవితా రాజశేఖర్‌ చిన్న కుమార్తె, శివానీ చెల్లెలు శివాత్మిక ఓ చిత్రంలో జంటగా నటించనున్నారని సమాచారం.

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో మధుర ఎంటర్‌ౖటైన్‌మెంట్స్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్లపై  మధుర శ్రీధర్, యష్‌ రంగినేనీలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళ్లనుందనే విషయాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. జీవితారాజశేఖర్‌లకు ఇది మెమరబుల్‌ ఇయర్‌ అని చెప్పొచ్చు. ఒకవైపు పెద్ద కుమార్తె శివానీ నటిస్తున్న ‘2 స్టేట్స్‌’ సినిమా రీమేక్‌ సెట్స్‌లో ఉండగానే, తమిళంలోనూ ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఇప్పుడు శివాత్మిక ఎంట్రీ కూడా షురూ అయింది.

మరిన్ని వార్తలు