ఇట్స్‌ సాహో టైమ్‌

9 Jun, 2019 03:55 IST|Sakshi
శ్రద్ధాకపూర్‌

‘స్ట్రీట్‌డ్యాన్సర్‌ త్రీడీ’, ‘చీఛోరే’, ‘భాగీ 3’, ‘సాహో’ ఇలా వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌. ఒక్కో సినిమా కోసం ఒక్కో లొకేషన్‌కి వెళ్తున్నారీ భామ. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం హైదరాబాద్‌ వచ్చారామె. ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు న్నారని తెలిసింది.

నైట్‌ షూట్‌ జరుగుతోంది. ఇలా ప్రస్తుతం శ్రద్ధాకు ‘సాహో’ టైమ్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రద్ధా ల్యాండ్‌ అవడానికి ముందు ‘స్ట్రీట్‌డ్యాన్సర్‌ త్రీడీ’  చిత్రం కోసం దుబాయ్‌ వెళ్లొచ్చారు శ్రద్ధా. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరో. ఈ సంగతు లన్నీ పక్కనపెడితే.... సౌత్‌ కొరియన్‌ మూవీ ‘మిస్‌గ్రానీ’ బాలీవుడ్‌ రీమేక్‌లో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటించబోతున్నారని తాజా బాలీవుడ్‌ ఖబర్‌.

మరిన్ని వార్తలు