సూపర్‌హీరో అవుతా

9 Nov, 2019 00:44 IST|Sakshi
సిద్ధార్థ్‌ మల్హోత్రా

కెరీర్‌ని పక్కాగా ప్లాన్‌ చేసుకుని వెళ్లే తారలు కొందరైతే ఏ ప్లానింగ్‌ లేకుండా ముందుకు సాగిపోయే తారలు కొందరు ఉంటారు. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా మొదటి రకం. ‘రాబోయే ఐదేళ్లలో మీ కెరీర్‌ ప్లాన్స్‌ ఏంటీ? అన్న ప్రశ్నను ఈ కుర్ర హీరో ముందు ఉంచితే... ‘‘రాబోయే రోజుల్లో నేను ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకుంటున్నాను. హాలీవుడ్‌ మార్వెల్‌ సిరీస్‌ చిత్రాలకు నేను అభిమానిని.

నా ప్రొడక్షన్‌ హౌస్‌లో ఓ సూపర్‌హీరో మూవీ చేసే ఆలోచన ఉంది. అందులో నేనూ నటిస్తాను. మన పురాణగాథల ఆధారంగా చాలా గొప్ప చిత్రాలు తీయొచ్చు. ఈ విషయంపై కూడా సినిమాలు చేసే ప్లాన్స్‌ ఉన్నాయి’’ అని అన్నారు. ఇంకా  చెబుతూ– ‘‘నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నాను. అందుకే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లో నటించాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్‌.

మరిన్ని వార్తలు