విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

6 Nov, 2019 10:10 IST|Sakshi
విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడిస్తున్న చిరువ్యాపారులు

చెన్నై, పెరంబూరు: నటుడు విజయ్‌సేతుపతి ఇంటిని మంగళవారం చిరు వ్యాపారులు ముట్టడించి ఆందోళనకు దిగారు. విజయ్‌సేతుపతి ఇటీవల మండి ఆన్‌లైన్‌ వ్యాపార ప్రచార యాప్‌లో నటించారు. ఆన్‌లైన్‌ వ్యాపారంతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ, ఆ మండి ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటన చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి నటించడాన్ని చిరు వ్యాపార సంఘాలు తీవ్రంగా వ్యతికేస్తున్నాయి. ఈ విషయంలో విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడించి ఆందోళనలకు దిగుతామని ఇంతకు ముందే హెచ్చరించారు.

అన్నట్లుగానే మంగళవారం స్థానిక వలసరవాక్కం, అళ్వార్‌ తిరునగర్‌లోని విజయ్‌సేతుపతి ఇంటిని వందలాది మంది చిరు వ్యాపారలు ముట్టడించి ఆందోళనకు దిగారు. తమిళనాడు వ్యాపార సంఘాల అధ్యక్షుడు కొలత్తూర్‌ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నటుడు విజయ్‌సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగించే ఆన్‌లైన్‌ వ్యాపారాలను ప్రోత్సహించరాదన్నారు. అయితే విజయ్‌సేతుపతి ఇంటిని ముట్టడి గురించి ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రతను ఏర్పాటు చేశారు. ఆందోళన కారులను అరెస్ట్‌ చేసి సమీపంలోని ఒక కల్యాణ మంటపానికి తరలించారు. కాగా ఆన్‌లైన్‌ వ్యాపార విధానాన్ని నిషేధించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయనున్నట్లు కొలత్తూర్‌ రవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌