వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

27 Nov, 2019 16:19 IST|Sakshi

‘నీ దగ్గర అంతుందేంట్రా అంటే... అంతులేనంత’ అంటున్నాడు సుడిగాలి సుధీర్‌. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు. ఇవన్నీ అతడి తొలి చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.లోని డైలాగులు. ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. తనకు అలవాటైన పంచ్‌ డైలాగులు, డాన్స్‌తో సుధీర్‌ అదరగొట్టాడు. పనిలో పనిగా ఫైటింగ్‌లు చేసేశాడు. సుధీర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ట్రైలర్‌ ఉంది.

సుధీర్‌కు జోడిగా ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. నాజర్‌, సాయాజి షిండే, ఇంద్రజ, పృథ్విరాజ్‌, ఎన్‌.శివప్రసపాద్‌, గద్దర్‌ తదితరులు ఈ పాత్రల్లో నటించారు. (చదవండి: ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా అనుకున్నా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు