నిలకడగా సోనాలి బింద్రే ఆరోగ్యం

3 Aug, 2018 12:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహల్‌ ట్వీట్‌ చేశారు. క్యాన్సర్‌పై పోరాటం దీర్ఘకాలమైనా తాము సానుకూల దృక్పథంతో ప్రయాణం ప్రారంభించామన్నారు. తాను మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జులైలో సోనాలి వెల్లడించిన విషయం తెలిసిందే.

‘సోనాలి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదు.. సానుకూల దృక్పథంతో తాము ఈ ప్రయాణాన్ని ప్రారంభించా’మని గోల్డీ బెహల్‌ ట్వీట్‌ చేశారు. క్యాన్సర్‌ రూపంలో తనకు ఎదురైన ప్రాణాంతక వ్యాధిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్న సోనాలీని బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు