ఆయన నాకు మావయ్యే

29 Jan, 2014 03:12 IST|Sakshi
ఆయన నాకు మావయ్యే
చిత్ర పరిశ్రమలో మనుషుల మధ్య బంధాలన్నీ అవసరాల వరకే పరిమితం అంటారు. అయితే అందరిలో కాకపోయినా కొందరిలో సత్సంబంధాలు కొనసాగుతాయి. అలాంటి వారు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంటారు. అలాంటి ఆత్మీయుడు తనకు దర్శక, నిర్మాత, నటుడు శశికుమార్ అంటోంది నటి అనన్య. నాడోడిగళ్ చిత్రంతో కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ మాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసిన ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు అంతంత మాత్రమే. దీనికి కారణాలేంటో ఆమెనే అడిగి తెలుసుకుందాం. 
 
 మీతో పాటు పరిచ యం అయిన నటీమణులు ప లు చిత్రాలలో నటిస్తున్నారు. మీకు మాత్రం గ్యాప్ రావడానికి కారణం ఏమిటంటారు?
 నేను మలయాళంలో చాలా చిత్రాలు చేశాను. తమిళంలో మాత్రం నాలుగు చిత్రాల్లో నటించాను. మరో రెండు చిత్రాలు విడుదల దశలో న్నాయి. తమిళంలో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం తరువాత కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే. అయితే ఎక్కువ చిత్రాలు చేసే కంటే తక్కువ చిత్రాలలోనైనా మంచి కథా చిత్రాలు చేయాలన్నదే నా పాలసీ.
 
 మలయాళ హీరోయిన్లు చాలామంది గాయనీమణులుగా అవతారమెత్తుతున్నా రు. మీకు అలాంటి ఆశ లేదా?
 ఆశ మాత్రమే కాదు. నేను గాయనినే. మలయాళంలో ఒక సంగీత ఆల్బమ్‌లో పాడాను. అందులో ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఒక పాట ఉంటుంది. అదే విధంగా 100 డిగ్రీల సెల్సియస్ అనే మలయాళ చిత్రంలో ఒక పాట పాడాను. అవకాశం వస్తే తమిళంలోనూ నా గాన మాధుర్యాన్ని వినిపించడానికి రెడీనే.
 
 మీ స్నేహితుడు నటుడు శశికుమార్ గురించి?
శశికుమార్ నాడోడిగళ్ చిత్రంతో నాకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆ చిత్రంలో నేను ఆయన్ని మామ య్య అని పిలుస్తాను. బయట కూడా ఇప్పటికీ మావయ్య అనే పిలుస్తాను. సినిమాకు సంబంధించి ఎలాంటి సందేహం కలిగినా ముందుగా ఆయన్నే అడిగి తీర్చుకుం టాను. సహ నటుడన్నదానికంటే శశికుమార్ నాకు చాలా ఎక్కువే.
 
 మీ నటన సహజంగా ఉంటుందంటారు?
 థ్యాంక్స్. అయితే అందుకు కారణం షూటింగ్‌కు ముందు ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా మామూలు అనన్యగానే పాల్గొం టాను. దర్శకుడు ఏమి చెబితే అదే చేస్తాను. అందువలనే నా నటన సహజత్వంతో ఉంటుంది.
 
 మీ వివాహం గురించి చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయే?
నేను నా భర్తతోనే కలిసి జీవిస్తున్నాను. నా గురించి జరుగుతున్న ప్రచారం ఏది నిజం కాదు. మా ఆయన నా కెంతో తోడ్పాటు నందిస్తున్నారు. వివాహానికి ముందు చిన్న అమ్మాయిగా ఉండేదాన్ని. పెళ్లి తరువాతనే మెచ్యూరిటీ సాధించాను.