శ‍్మశానవాటికకు శ్రీదేవి భౌతికకాయం

28 Feb, 2018 15:29 IST|Sakshi

ముంబై : సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర ముగిసింది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.

ఈ రోజు ఉదయం 9.30 సమయంలో అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క‍్లబ్‌లో ఉంచారు. మధ్యాహ‍్నం 12.30 వరకు అభిమానులను అనుమతించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్‌ హీరో వెంకటేష్‌లతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై విచ్చేశారు విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. గౌరవ సూచకంగా ఆమె భౌతికకాయంపై పోలీసులు త్రివర్ణ పతాకం కప్పారు.  ఈ నెల 24న శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు