ప్రతినాయకి పాత్రల్లో రాణించాలి

28 Aug, 2017 04:31 IST|Sakshi
ప్రతినాయకి పాత్రల్లో రాణించాలి

తమిళసినిమా:  ప్రతినాయకి పాత్రల్లో రాణించాలన్నది తన కోరిక అని అంటున్నారు నటి లిజీ ఆంటోనీ. ఆమె ఎవరు, నటిగా సత్తా ఏమిటన్నది తరమణి చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇందులో పోలీసు అధికారిగా నటించిన చిత్ర నిర్మాత జే.సతీష్‌కుమార్‌కు భార్యగా నటించిన నటి లిజీ ఆంథోని. ఆమె తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. మా పూర్వీకం కేరళకు చెందినదైనా నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. అదీ ఉత్తర చెన్నైలోని వణ్ణైయార్‌పేట.  ఆంగ్లో ఇండియన్‌ పాఠశాలలో చదివి, స్టె ల్లామేరిస్‌ కళాశాలలో బీకామ్, మద్రాసు వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాను.

అనంతరం స్త్రీలది షాపింగ్‌ ప్రపంచం అని భావించి ఆ రంగంలోకి ప్రవేశించి దేశ విదేశాలు తిరిగి అందులో రాణించాను. అలా నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే సంప్రదాయబద్ధంగా క్లాసిక్‌ నృత్యాన్ని నేర్చుకున్నాను. ఆ మధ్య ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు రామ్‌తో స్నేహం ఏర్పడింది. ఆయన తంగమీన్‌గళ్‌ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించమని అడగడంతో నటించాను. అందులో స్టెల్లా మిస్‌ పాత్ర మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత 15 చిత్రాల వరకూ నటించాను. రామ్‌ మళ్లీ తరమణి చిత్రంలో అవకాశం కల్పిం చారు.

ఆయన చిత్రాలలో పాత్రలు ఎలా ఉం టాయో నాకు బాగా తెలుసు. అందుకే పాత్ర గురించి కూడా అడగకుండా నటించడానికి ఓకే చెప్పాను. ఇందులో పోలీసు అధికారి భార్యగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఇందులోని నటనకు గానూ చాలా మంది ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌ల ద్వారా  ప్రశంలందాయి. నాకు నటనలో స్ఫూర్తి అంటూ ఎవరూ లేరు. అలా మరొకరిని అనుకరించాలని అనుకోను. ప్రతినాయకి పాత్రల్లో రాణించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం రామ్‌ దర్శకత్వంలో పేరంబు చిత్రంతో పాటు, ఛూ మంత్రకాళి, ఇలా మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది లిజీ ఆంథోని.

>