కేవలం అతిధి పాత్రలే..చాలా బిజీ

2 Jan, 2016 14:00 IST|Sakshi
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక లేదని అలనాటి అందాల హీరోయిన్, అమల అక్కినేని అన్నారు.  తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతగా  హైదరాబాద్ బ్లూ క్రాస్  సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ  బాధ్యతలతో తాను ఇపుడు చాలా  సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు.  అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని  వెల్లడించారు.
  
అలాగే షూటింగ్ పేరుతో, కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి ఇతర నగరాలు తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే పూర్తికాలంకాకుండా కేవలం అతిధి పాత్రలకే  ప్రాధాన్యత ఇస్తానన్నారు.  కథ, పాత్ర నచ్చితే  అతిధి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు.అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్  చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే  ఉద్దేశం లేదన్నారు. 
 
ప్రముఖ దర్శకులు  నటించమని  తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. సం.రానికి కనీసం ఇద్దరు దర్శకులు తనకు ఫోన్ చేసి నటించే ఉద్దేశం  ఉందా అని అడుగుతారని పేర్కొన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి  మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ  తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ  ప్రాజెక్ట్ పదిరోజుల షూటింగ్ నిమిత్తం ఈ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. 
 
కాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను పెళ్లాడిన తర్వాత అమల అక్కినేని దాదాపుగా సినిమాలకు దూరంగా  ఉంది.  ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్' సినిమాలో మెరపులు మెరిపించింది. అనంతరం  అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లోనూ ఓ సీన్లో నూ కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో నటనకుగాను  విమర్శకుల ప్రశంసలందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. మలయాళ దర్శకుడు రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో  వస్తున్న ఈ  సినిమాలో  జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.