తమిళం నుంచి ట్రాఫిక్

5 Feb, 2014 03:35 IST|Sakshi
తమిళం నుంచి ట్రాఫిక్
శరత్‌కుమార్, రాధిక, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా షాహిద్ ఖదీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘చెన్నయ్‌ఇల్ ఒరు నాళ్’. ఈ చిత్రం తెలుగులో ‘ట్రాఫిక్’ పేరుతో విడుదల కానుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేశారు. ‘‘తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రానికి మలయాళంలో రూపొందిన ‘ట్రాఫిక్’ సినిమా మాతృక. మోహన్‌లాల్ అందులో ప్రధాన పాత్ర పోషించారు. మలయాళం, తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని నిర్మాత అన్నారు. కె.వి.వి.సత్యనారాయణ, శివప్రసాద్ వై., టి.ప్రసన్నకుమార్, సురేష్ కొండేటి, సాహితి, సాయివెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.