‘మోహిని’ ట్రైలర్‌ విడుదల

16 Jul, 2018 18:43 IST|Sakshi

చిత్రసీమలో హారర్‌ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా కథనం సరిగా లేకపోతే బెడిసికొడుతుంది. దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు ఇలా ఒకప్పటి కథలతో సినిమాలను తీసినా.. కథనం మాత్రం ఈతరానికి నచ్చేవిధంగా.. కాస్త కామెడీ టచ్‌ ఇస్తే సినిమా హిట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ప్రేమ కథా చిత్రమ్‌, ఆనందో బ్రహ్మ, రాజు గారి గది ఇలా ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి.

గతంలో త్రిష నాయకి అంటూ హారర్‌ మూవీ చేశారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా త్రిష మరో హారర్‌ సినిమాలో నటిస్తున్నారు. మోహినిగా త్రిష నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా ఫారెన్‌ లొకేషన్లలో జరిగినట్టు కనిపిస్తోంది. వివేక్‌ మెర్విన్‌ సంగీతాన్ని అందించగా, ఆర్‌ మధేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ నటుడు సురేష్‌, జాకీ, తమిళ హాస్య నటుడు యోగీ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు