ఆచార్య నుంచి అవుట్‌

14 Mar, 2020 00:58 IST|Sakshi

‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకున్నారు త్రిష. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. అయితే క్రియేటివ్‌ డిఫెర్సెన్స్‌ వల్ల ‘ఆచార్య’ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్‌ మీడియా ద్వారా త్రిష వెల్లడించారు. ‘‘కొన్నిసార్లు మొదట్లో మనకు చెప్పిన విషయాలు, చర్చలు మారిపోతుంటాయి.

క్రియేటివ్‌ డిఫర్సెన్స్‌ వల్ల నేను చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో నటించడం లేదు. త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో నా తెలుగు అభిమానులను కలుస్తాను’’ అని పేర్కొన్నారు త్రిష. 2016లో ‘నాయికి’ అనే తమిళ, తెలుగు చిత్రం తర్వాత త్రిష అంగీకరించిన చిత్రం ‘ఆచార్య’. ఇప్పుడీ సినిమా నుంచి తప్పుకున్నారామె. ఇదిలా ఉంటే 2006లో వచ్చిన ‘స్టాలిన్‌’లో చిరంజీవి, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 

మరిన్ని వార్తలు