ముగ్గురు లెంజడరీ హీరోలు కలిసి పాడిన వేళ!

29 Dec, 2015 21:57 IST|Sakshi

ముంబై: బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. లెంజడరీ హీరోలు రాజ్‌కపూర్, శశికపూర్‌తో కలిసి తాను పాట పాడుతున్న ఫొటో అది. అలానాటి మధురజ్ఞాపకమది. 'అప్పట్లో సోవియట్ రష్యాలో ఉన్న తాష్కెంట్‌లో రాజ్‌కపూర్‌ జీ, శశికపూర్‌జీతో కలిసి 'సారే జహా సే అచ్చా' అనే పాట పాడాను' అంటూ ఆ జ్ఞాపకాన్ని బిగ్‌ బీ నెమరువేసుకున్నారు.

ఈ ఏడాది 'పీకూ' సినిమాతో ఘనవిజయం సాధించిన అమితాబ్‌ బచ్చన్‌ త్వరలోనే 'వజీర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'వజీర్'లో ఫర్హాన్ అఖ్తర్‌, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.