పచ్చి మామిడి.. పిచ్చి కామెంట్‌!

28 Feb, 2019 02:37 IST|Sakshi
లక్ష్మీరాయ్‌

లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో కిషోర్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’. రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్‌.కె. రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను మార్చి 15న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ –  ‘‘కామెడీ, హారర్, గ్లామర్‌ సహా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న కమర్షియల్‌ చిత్రమిది. లక్ష్మీరాయ్‌ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్‌ లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కథ, కథనం, మాటలు: తటవర్తి కిరణ్‌.

ఏదిపడితే అది ఊహించుకోవద్దు
ఒకవైపు ‘వేర్‌ ఈజ్‌ ది...’ ప్రమోషనల్‌ కార్యక్రమాలతో లక్ష్మీరాయ్‌ బిజీగా ఉంటే మరోవైపు ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఇలా హీరోయిన్ల విషయంలో గాసిప్‌లు సృష్టిస్తుంటారు. చాలాసార్లు వాటిని విననట్లు వదిలేసినా, కొన్నిసార్లు ఘాటుగా స్పందించి వాటిని కొట్టిపారేస్తుంటారు. లక్ష్మీరాయ్‌ కూడా ఈ వార్త నిజం కాదన్నారు. ‘‘నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాసుకుంటారా? అంత నమ్మకంగా ఎలా న్యూస్‌ అల్లేస్తారు? అదేదో నన్నే అడిగి ఉంటే ఇంకా మంచి స్టోరీ ఇచ్చుండేదాన్ని కదా? ఏది పడితే అది ఊహించుకోవద్దు’’ అని ట్వీటర్‌లో రియాక్ట్‌ అయ్యారామె. ఇంతకీ ఈ గాసిప్‌ పుట్టడానికి కారణం ఏంటంటే... లక్ష్మీరాయ్‌ పచ్చి మామిడికాయ తింటూ కనిపించారట.

మరిన్ని వార్తలు