నీ మోకాలు ఎటు పోయింది.. ఇది చెత్త ఫోటోషాప్‌..

10 Jan, 2020 08:27 IST|Sakshi

ముంబై : నాలుగు పదుల వయసులోను  ఏమాత్రం చెక్కు చెదరని అందాలతో ఇప్పటికీ టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ కరీనా కపూర్‌. సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. అయితే అప్పుడప్పుడు తాము ఆరాధించే హీరోలు, హీరోయిన్లు చేసే పనులు అభిమానులను నిరాశ చెందిస్తాయి. వాళ్లను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో.. ఒక్కోసారి వారు చేసే పనులు నచ్చకుంటే అంతే విమర్శిస్తారు. తాజాగా కరీనా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. ఇటీవల ఓ మ్యాగజైన్‌ ఫోటోషూట్‌కు హాజరైన కరీనా.. తన అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో ఫోటోషూట్‌కు సంబంధించిన ఓ ఫోటోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

కరీనా అభిమానులు సైతం ఈ ఫోటోపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఫోటో ఏ మాత్రం బాలేదంటూ, ఎడిట్‌ చేయంలో విఫలమైందంటూ మండిపడుతున్నారు. ఫోటోలో తన మోకాలు కనిపించకుండా ఎడిట్‌ చేశారని, ఎడిట్‌ చేసే ముందు సరి చూసుకోవాలి కదా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అందంగా ఉంటావ్‌ కరీనా నీ కాలుకు అంతా ఫోటోషాప్‌ ఎడిటింగ్‌ ఎందుకు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఈ ఫోటోలో నీ మోకాలు ఎటు పోయింది. ఇది చెత్త ఫోటోషాప్‌. దిండుపై పడ్డ  కాళ్ల నీడను సరిచూసుకోవాల్సింది ఉంది’’ అని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక ఇలాంటి నెగిటీవ్‌ కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్‌ అంతా నిండిపోయింది. మరీ ఈ విషయంపై కరీనా ఎలా స్పందిస్తారో చుడాలి.

Monday mood 💁🏻‍♀️ ________________________________________________________ #KareenaKapoorKhan #MondayMood #CelebStyle #KareenaKapoor #Vibe #MajorMood #MondayBlues

A post shared by GRAZIA India (@graziaindia) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు

కరోనా పాట

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

సినిమా

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు

కరోనా పాట

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..