‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వచ్చేశాడు

3 Jan, 2020 16:46 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’... ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్‌.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కాదు’ అన్న హీరోయిన్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో విజయ్‌ దేవరకొండ డిఫరెంట్‌ షేడ్స్‌తో కనిపించాడు. మిడిల్‌ క్లాస్‌ భర్తగా, లవర్‌గా, బైక్‌ రైడర్‌గా,  పైలట్‌గా, భగ్న ప్రేమికుడిగా విజయ్‌ను విభిన్నమైన వెరియేషన్స్‌లో చూపిస్తూ టీజర్‌ సాగింది. ఇందులో రాశీకన్నా, క్యాథరిన్‌, ఇజాబెల్లా లీటే, ఐశ్వర్యా రాజేశ్‌లతో లవ్‌, రొమాన్స్‌తోపాటు ఇంటెన్స్‌ ఎమోషన్స్‌ చూపించారు. ఇక, విజయ్‌ ఏ సినిమా తీసినా ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం సహజమే. ఈ సినిమా టీజర్‌లో భగ్న ప్రేమికుడిగా విజయ్‌ ఇంటెన్స్‌ ఎమోషన్స్‌, యామిని అంటూ చివర్లో చెప్పిన డైలాగులు ‘అర్జున్‌రెడ్డి’ని తలపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ సినిమా ‘అర్జున్‌ రెడ్డి-2’నా  అని కామెంట్‌ చేయడం కనిపిస్తోంది.

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ హిట్లు సాధించి టాలీవుడ్‌లో సెన్సెషన్‌ అండ్‌ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. అయితే డియర్‌ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేయస్‌ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది.

మరిన్ని వార్తలు