ఎంటర్‌టైనింగ్‌.. ఎంగేజింగ్‌

21 May, 2018 01:38 IST|Sakshi
కార్తీక్‌ ఆనంద్, డింపుల్

కార్తీక్‌ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రశాంత్‌ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్‌ ఆనంద్‌  మాట్లాడుతూ –‘‘ఈ చిత్రానికి కథే బలం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్, ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది.

కాలేజ్‌ ఫెస్ట్‌ నేపథ్యంలో జరిగే కథ ఇది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్‌.మా సినిమాలో అదేంటన్నది సస్పెన్స్‌’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘మా చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అవుట్‌పుట్‌ చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. జులై ఫస్ట్‌ వీక్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోయిన్‌గా ఇది నా రెండో చిత్రం. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు డింపుల్‌. ఈ చిత్రానికి సంగీతం: నరేష్‌ కుమరన్, కెమెరా: విశ్వ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు