ఢిల్లీలో లక్షా 26 వేలు దాటిన కరోనా కేసులు

22 Jul, 2020 20:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటింది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1227 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 29 మంది మృతి చెందారు. 1532 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (ఇంటిపేరు ‘చూతియా’.. దరఖాస్తు నిరాకరణ)

ఢిల్లీలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 1,26,323, మరణాల సంఖ్య 3,719గా ఉంది. ఇప్పటి వరకు చికిత్స పూర్తిచేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,07,650 కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 14,954గా ఉంది. (‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’)

దేశరాజధానిలో ఇప్పటి వరకు 8,71,371 కరోనా టెస్ట్ లు నిర్వహించారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారి సంఖ్య 7,966గా ఉంది. కరోనా రోగులకు వివిధ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 15,475గా ఉంది. ఇక ప్రతి మిలియన్‌ జనాభాలో కరోనా టెస్ట్‌ల సంఖ్య 45,861గా ఉంది.

మరిన్ని వార్తలు