బృందావనంలో 70 అంతస్తుల ఆలయం

16 Mar, 2014 04:24 IST|Sakshi
బృందావనంలో 70 అంతస్తుల ఆలయం

చిలిపి చేష్టల కృష్ణుడికి నిర్మిస్తున్న మరో అద్భుత ఆలయం నమూనా ఇది. కృష్ణుడు చిన్నతనంలో తిరుగాడిన ప్రదేశంగా పేర్కొనే ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో.. దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా 70 అంతస్తులుగా దీనిని నిర్మించనున్నారు. ‘అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్)’ 62 ఎకరాల విస్తీర్ణంలో.. 213 మీటర్ల ఎత్తుతో ‘బృందావన్ చంద్రోదయ మందిర్’ పేరిట ఈ ఆలయాన్ని నిర్మించనుంది.
 
  ఆలయం చుట్టూ దాదాపు 30 ఎకరాల్లో అడవిని పెంచనున్నారు. ఈ ఆలయంలో రథయాత్ర, పల్లకి, ఊయల ఉత్సవం సహా ఏడాది పొడవునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరుగనుంది.
 

మరిన్ని వార్తలు