ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం

8 Jul, 2019 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్  అధ్యక్షతన సోమవారం వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన పథకాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ఏడు అంశాలు ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం జరగనుంది. 1. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. 2. పీఎం కిసాన్ మన్ ధాన్ యోజన. 3. కిసాన్ క్రెడిట్ కార్డు. 4. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన. 5.అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్స్. 6. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మార్కెట్ కమిటీ. 7. ఆర్గానిక్ ఫార్మింగ్ అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ రాహూల్ బొజ్జా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని మంత్రి నిరంజన్‌రెడ్డి  వివరించనున్నారు.

మరిన్ని వార్తలు