ఇరాన్‌ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు

4 Jan, 2020 10:43 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆ దేశ గగనతలం మీదుగా ఎలాంటి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ఇరాన్‌ జనరల్‌ కమాండర్‌ ఖాసీం సులేమానిని అమెరికా మిలటరి దళాలు మట్టుబెట్టడంతో ఇరాన్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌ దేశం అమెరికాకు చెందిన విమానాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా ఇరాన్‌ గగనతలం మీదుగా ఇండిగో, ఎయిర్‌ లైన్స్‌ విమానాలను దారి మళ్లించే ఏరాట్లు చేస్తున్నట్లు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.(ఇరాన్‌ వెన్ను విరిగింది!)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు బాగ్దాద్‌ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున  గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు నిర్వహించారు. ఈ ప్రమాదంతో ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్‌ అల్‌ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు ఇప్పటికే బాగ్దాద్‌ మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్‌ ప్రకటించింది. మా నాయకుడు సులేమానీ చంపినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌  అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.(ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి)

మరిన్ని వార్తలు