కేంద్ర హోం శాఖ నూతన కార్యదర్శిగా అనిల్ గోస్వామి

1 Jul, 2013 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ నూతన కార్యదర్శిగా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ గోస్వామి(58) ఆదివారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు, ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ హోం సెక్రటరీ పదవికి గోస్వామి పేరును ఆమోదించింది. 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోస్వామి జమ్మూ నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి అధికారి కావడం విశేషం. 2015, జూన్ వరకు సుమారు రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. హోం శాఖలో ఇప్పటి వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా గోస్వామి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్‌కే సింగ్ ఆదివారం పదవీ విరమణ పొందారు.
 

మరిన్ని వార్తలు