అవును ఆ ఫోన్లలో సమస్య ఉంది: ఆపిల్‌

22 Nov, 2016 12:22 IST|Sakshi
అవును ఆ ఫోన్లలో సమస్య ఉంది: ఆపిల్‌

న్యూఢిల్లీ: తమ ప్రొడక్ట్‌.. ఐఫోన్‌ 6 ప్లస్‌ మోడల్‌ ఫోన్లలో కొంత సమస్య ఉన్న మాట నిజమే అని ఆపిల్‌ కంపెనీ అంగీకరించింది. ఫోన్‌ డిస్‌ప్లే కొన్నిసార్లు స్పందించడం లేదని, ఈ సమస్యను సరిచేయడం కోసం ప్రత్యేక రిపేర్‌ ప్రోగ్రాంను లాంచ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సర్వీస్‌ ఉచితం మాత్రం కాదు.

టచ్‌ డిసీజ్‌ గా పిలువబడుతున్న ఈ సమస్యలో.. కొన్ని సార్లు డిస్‌ప్లే మినుకుమినుకుమంటూ స్పందించకుండా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫోన్‌పై ఒత్తిడి పడినప్పుడు, ఇతర సందర్భాల్లో ఈ సమస్య వస్తున్నట్లు గుర్తించామని ఆపిల్‌ వెల్లడించింది. దీని కోసం స్పెషల్‌ రిపేర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా రూ. 9,900 చెల్లించి టచ్‌ డిసీజ్‌ ఉన్న ఫోన్లను రిపేర్‌ చేయించుకోవచ్చని ఆపిల్‌ వెల్లడించింది. అయితే.. డిస్‌ప్లే పగలకుండా, వర్కింగ్‌ కండీషన్లో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ అవకాశం అని తెలిపింది. ఇది కేవలం ఐఫోన్‌ 6 ప్లస్‌ మోడల్‌ కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 

>
మరిన్ని వార్తలు