దీని సామర్థ్యం.. ఫెంటాస్టిక్..

6 Jul, 2014 00:54 IST|Sakshi
దీని సామర్థ్యం.. ఫెంటాస్టిక్..

 ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని విమానంలా ఉంది కదూ.. అయితే ఇది విమానం కాదు.. యుద్ధ హెలికాప్టర్. పేరు ఏవీఎక్స్ జేఎంఆర్. టెక్సాస్‌కు చెందిన ఏవీఎక్స్ సంస్థ దీని డిజైన్‌ను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అమెరికా తదుపరి తరం యుద్ధ హెలికాప్టర్ అయ్యే చాన్స్ దీనికే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా సైన్యంలో సేవలందిస్తున్న బ్లాక్ హాక్ హెలికాప్టర్ల్లను మార్చాలని భావిస్తున్న పెంటగాన్.. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది.

రూ.6 లక్షల కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడానికి ఓ నాలుగైదు సంస్థలు పోటీపడుతుండగా.. ఏవీఎక్స్ అందులో ముందంజలో ఉంది. ఈ ఎటాక్ హెలికాప్టర్‌కు రెండు రోటర్లు ఉంటాయి. మొత్తం 16 మంది ప్రయాణించే వీలున్న ఈ హెలికాప్టర్ అత్యధిక వేగం గంటకు 434 కిలోమీటర్లు. బరువు 12 వేల కిలోలు. 5,900 కిలోల బరువును సునాయాసంగా మోయగలదు. ఇక శత్రువులపై దాడి చేయడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు, ఏర్పాట్లు ఇందులో దండిగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు