'ఆయనకు భారతరత్న ఇవ్వాలి'

23 Mar, 2016 19:13 IST|Sakshi

చండీఘడ్‌: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ డిమాండ్‌ చేశారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడిగా ఉన్న బాదల్‌.. భగత్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనీ కోరుతూ త్వరలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.

బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు భగత్‌సింగ్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా భగత్‌ సింగ్‌ పూర్వికుల గ్రామమైన కట్కార్‌కలన్‌ జలంధార్‌ - చండీఘడ్‌ హైవే సమీపంలో  ఉంది. అమరవీరుడు భగత్‌ సింగ్‌ నడియాడిన ఈ గ్రామంలో ఆయన తాత నివాసం భగత్‌సింగ్‌ స్మారక చిహ్నం, మ్యూజియంగా మారింది.

మరిన్ని వార్తలు