సీఎంకు చుక్కెదురు.. ఏడుకోట్ల ఆస్తులు అటాచ్

24 Mar, 2016 12:00 IST|Sakshi
సీఎంకు చుక్కెదురు.. ఏడుకోట్ల ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల కిందట కేసునమోదు చేసిన ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు ఆయన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. దాదాపు రూ.7కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపిందని ఓ వార్తా సంస్థ తెలిపింది.

తనపై ఈడీ చేస్తున్న దర్యాప్తును ఆపేయాలని, స్టే విధించాలని కోరుతూ వీరభద్ర సింగ్ గత వారం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లినా కోర్టు అందుకు అనుమతించలేదు. దీంతో ఈడీ మరోసారి ఆయన ఆస్తుల విషయంలో వేగంగా కదిలి రూ.7కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే, ఏమేం ఆస్తులు అటాచ్ చేశారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉక్కుశాక మంత్రిగా 2009-11 కాలంలో పనిచేసినప్పుడు ఆయన, తన కుటుంబం కలిసి మొత్తం రూ.7కోట్లను అక్రమంగా సంపాధించారని కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు