రేపు భారత్‌ బంద్‌!: కేంద్రం సూచనలు

9 Apr, 2018 20:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగాల్లో కులం ప్రాతిపదికన అమలవుతోన్న రిజర్వేషన్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కొందరు మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే, రేపటి బంద్‌కు ఏ ఒక్క సంస్థగానీ, రాజకీయ పార్టీగానీ బాధ్యత వహించడంలేదు. కేవలం సోషల్‌ మీడియాలో సాగుతోన్న ప్రచారం ఆధారంగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు రంగంలోకి దిగింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 2న దళిత సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌: రిజర్వేష్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న భారత్‌ బంద్‌ జరగబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్‌ అయ్యాయి. విద్యా, ఉదోగ్యాల్లో కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా లక్షలకొద్దీ సందేశాలు వెలువడటంతో కేంద్రం అప్రమత్తమైంది. మొన్నటి అనుభవం దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలకూ సూచనలు పంపింది.

మరిన్ని వార్తలు