విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీబీఎస్‌ఈ

7 Jul, 2020 19:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదైన కొన్ని రోజులకే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఈ క్రమంలోనే అన్ని తరగతుల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు  కేంద్ర ప్రభుత్వం కూడా  రద్దు చేసింది.   ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది పాఠశాలలు తెరవడం కష్టంగానే  కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. (ఫేస్‌బుక్‌తో జతకట్టిన సీబీఎస్‌ఈ)

ఇది  2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌  మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే కుదించిన సిలబస్‌ను కూడా టీచర్లు విద్యార్థులు  చెప్పాలని, అయితే వాటిని పరీక్షలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్‌ కుదింపు విషయంలో  కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. సిలబస్‌ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కూడా విద్యార్ధుల సిలబస్‌ 30 శాతం తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. (సీబీఎస్‌ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు