చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం

14 Sep, 2017 03:31 IST|Sakshi
చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం

న్యూఢిల్లీ: 1960ల్లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్‌ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్‌లకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్‌లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్‌కు వలస వచ్చారు. అప్పుడు వారు 5 వేల మంది దాకా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది.

మరిన్ని వార్తలు