భారత్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టులపై చైనా ఆసక్తి

13 Sep, 2017 15:12 IST|Sakshi
భారత్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టులపై చైనా ఆసక్తి

బీజింగ్‌ : భారత్‌లో హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టులపై చైనా ఆసక్తి చూపుతోంది. భారత్‌లో హై స్పీడ్‌ రైళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామనే సంకేతాలను తాజాగా పంపింది. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింబో అబె బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్న సమయంలో చైనా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముం‍చెత్తుతోంది.

మాదేశంలో హై స్పీడ్‌ రైళ్ల టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది.. ఢిల్లీ నుంచి అవకాశం వస్తే.. కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రిత్వం శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ చెప్పారు. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రయత్నించినా.. ఆశించిన ఫలితం రాలేదని చెప్పారు. తాజాగా న్యూఢిల్లీ-చెన్నై హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. అవకాశం వస్తే భారత్‌తో సంయుక్తంగా పనిచేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు