రాహుల్‌గాంధీకి పెళ్లి కావాలని!

31 Jul, 2018 04:14 IST|Sakshi

గోరఖ్‌పూర్‌: రాహుల్‌ గాంధీకి జీవితభాగస్వామి రావాలని భగవంతుడిని వేడుకున్నానని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి సోమవారం వ్యాఖ్యానించారు. ఉత్తరభారతంలో తొలి శ్రావణ సోమవారం సందర్భంగా సాధ్వి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్‌) రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అని సాధ్వి వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘కాంగ్రెస్‌ అగ్రనేతలపై వ్యాఖ్యలుచేయడం ఇలాంటి వ్యక్తులకు ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడే వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం  ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు