‘రాహుల్‌ ప్రధాని కావాలంటే శివుని ఆశీర్వాదం కావాలి’

19 Jun, 2018 08:25 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

జైపూర్‌, రాజస్థాన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 48 వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలు రాహుల్‌ పేరున జైపూర్‌ శివాలయంలో భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ విషయం గురించి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సెక్రటరీ సురేష్‌ మిశ్రా...‘ఈ రోజు మా పార్టీ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ పుట్టినరోజు. రాహుల్‌ జీ పుట్టిన రోజు వేడుకలను చాలా పెద్ద ఎత్తున​ నిర్వాహించాలనుకుంటున్నాము. 2019లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించి, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతాడు. ఇందుకు దేవుని ఆశీర్వాదం కూడా అవసరమే. అందుకే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని జైపూర్‌ సంగనీర్‌ రోడ్‌లోని శివాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నాము’. అన్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు...
రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ‘రన్‌ ఫర్‌ రాహుల్ గాంధీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రజస్వామ్యం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇదే కాక ప్రదేశ కాంగ్రెస్‌ కమిటి, నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా, సేవా దళ్‌, ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ కమిటిలు రాహుల్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. 

రాహుల్‌ గాంధీ 48వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో ‘రాహుల్‌ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు రాహుల్‌ గాంధీ’ అంటూ ట్వీట్‌ చేసారు.

మరిన్ని వార్తలు