కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు

5 Mar, 2020 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సభలో అనైతికంగా వ్యవహరించారంటూ లోక్‌సభలో ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా గురువారం సస్పెండ్‌ చేశారు. సస్పెండైన కాంగ్రెస్‌ ఎంపీల్లో గౌరవ్ గొగోయ్, టీ ఎన్ ప్రతాపన్, దిన్ కుర్యాకోస్, రాజ్ మోహన్ ఉన్నితన్, బెన్ని బెహన్, మాణికమ్ ఠాకూర్, రణ్విత్‌ సింగ్‌ బిట్టూ ఉన్నారు. ప్రస్తుత సెషన్‌లో మిగిలిన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాకుండా వీరిపై స్పీకర్‌ వేటు వేశారు.

సస్పెన్షన్‌కు గురైన సభ్యులు పేపర్లను చింపి వాటిని లోక్‌సభ స్పీకర్‌పై విసరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తమ సభ్యులపై వేటు వేయాలన్న నిర్ణయం స్పీకర్‌ది కాదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి ఆరోపించారు. సస్పెన్షన్‌ నిర్ణయానికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తమ పోరాటం​సభ లోపల, వెలుపల కొనసాగుతుందని చెప్పారు.

చదవండి : నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు