అబేను గుజరాత్‌కే ఎందుకు తీసుకెళ్లారు? : కాంగ్రెస్‌

14 Sep, 2017 09:16 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌ రాష్ట్రంలో కాలు మోపిన విషయం తెలిసిందే. అయితే ఓ దేశ ప్రధాని స్థాయి వ్యక్తిని.. పైగా మన దేశంతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు వచ్చిన తరుణంలో దేశ రాజధానిలో కాకుండా.. ఓ రాష్టంలో బస ఎందుకు ఏర్పాటు చేశారు? అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. 
 
కేవలం రాజకీయ కారణాలతోనే జపాన్‌ ప్రధానిని మోదీ గుజరాత్‌కు తీసుకెళ్లారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ ఆరోపించారు. బుధవారం మీడియా  సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఏడాది గుజరాత్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలోనే కేవలం రాజకీయ ప్రయోజనం పొందేందుకే మోదీ, అబేను కావాలనే అక్కడికి(గుజరాత్‌) తీసుకెళ్లారు. కీలక ఒప్పందాలు చేసుకోవటానికి వచ్చిన ఒక అతిథిని గౌరవించే తీరు ఇదేనా? అని మనీశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   
 
కాగా, నేడు జపాన్‌ ప్రధాని అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ముంబై, అహ్మదాబాద్ మ‌ధ్య ప‌రుగులు తీయ‌నుంది. అదే సమయంలో జపాన్ ప్రధాని సతీమణి అకి అబే అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్స్‌ అసోషియేషన్‌ను సందర్శించనున్నారు.
మరిన్ని వార్తలు