కలాం నివాసాన్ని విఙ్ఞాన కేంద్రంగా చేయాలన్న ఆప్

28 Oct, 2015 19:26 IST|Sakshi

ఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీలో నివసించిన ఇంటిని విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన అనంతరం కలాం 10 రాజాజీ మార్గ్లో నివాసమున్నారు. అయితే ప్రస్తుతం ఈ నివాసాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. హుటాహుటిన ఆ ఇంటిని ఓ మంత్రికి కేటాయించాల్సిన అవసరం ఏముందనీ.. కలాం నివాసమున్న ఇంటిని ఆయన స్మారకార్ధం విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని అన్నారు.

తమిళనాడులోని రామేశ్వరానికి మాత్రమే కలాంను పరిమితం చేసేలా ఆయనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు, ఇతర కలాం ఙ్ఞాపకాలను అక్కడికి తరలించడం సరికాదని మిశ్రా అభిప్రాయపడ్డారు. కలాం నివాసాన్ని ఆయన గౌరవార్థం ఢిల్లీలో పర్యాటక స్థలంగా మార్చాలని ఆప్ భావిస్తున్నట్లు మిశ్రా తెలిపారు.

మరిన్ని వార్తలు