తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు

15 May, 2020 09:10 IST|Sakshi

డెహ్రాడూన్ : ప‌విత్ర పుణ్య‌క్షేత్రం బ‌ద్రీనాథ్ ఆల‌యం తెరుచుకుంది. నేడు ( శుక్ర‌వారం) ఉద‌యం 4:30 నిమిషాల‌కు వేద మంత్రాల‌తో ఆల‌య ద్వారాలు తెరుచుకున్నాయి. అనంత‌రం ఆల‌యాన్ని పూల‌తో సుంద‌రంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప్ర‌ధాన పూజారితో సహా మొత్తం 28 మంది మాత్ర‌మే ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. అయితే క‌రోనా కార‌ణంగా దేవాల‌యాల‌న్నీ మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే.
(చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవ‌ర్)

కాగా  ప్ర‌స్తుతం పవిత్రక్షేత్రంలోకి భ‌క్తుల‌ను అనుమంచడం లేదు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ఆదేశాల మేర‌కు భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్‌ డివిజన్‌ మెజిస్ట్రేట్ అనిల్‌ ఛన్యాల్‌ తెలిపారు. శీతాకాల విరామం త‌రువాత ఏప్రిల్ 29న మొద‌ట ఆల‌య ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే క‌రోనా కార‌ణంగా ఏ యాత్రికుడిని ఆల‌యంలోకి అనుమంతించ‌లేదు. య‌త్రికులు లేకుండానే పంచ‌ముఖి డోలీ యాత్ర నిర్వ‌హించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాని లాక్‌డౌన్‌ కారణంగా ఈ సంవత్సరం భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు.

ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా!

మరిన్ని వార్తలు