రైళ్లలో కరోనా రోగులుంటారు జాగ్రత్త : ప్రయాణం ప్రమాదం

21 Mar, 2020 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్‌ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాదు రైల్వే ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇటీవలి కాలంలో రైళ్లలో కరోనా పాజిటివ్‌ రోగులు, అనుమానితులను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

రైళ్ళలో కోవిడ్‌-19 (కరోనా వైరస్) సోకిన కొన్ని కేసులను గుర్తించామని, ఇది రైలు ప్రయాణాన్ని ప్రమాదకరంగా చేస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. మీ సహ ప్రయాణీకుడికి కరోనావైరస్ ఉంటే మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున రైలు ప్రయాణానికి దూరంగా ఉండాలని   హెచ్చరిస్తోంది. అన్ని ప్రయాణాలను వాయిదా వేయండి..తద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోండని సూచిస్తూ రైల్వేమంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు