కరొనా వైరస్‌ కలకలం

20 Jan, 2020 07:24 IST|Sakshi
కోవై విమానాశ్రయంలో ప్రయాణికుడికి పరీక్షలు చేస్తున్న వైద్యుడు

చెన్నై,టీ.నగర్‌: చైనాలో కరొనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. కరొనా అనే క్రిమి ద్వారా అక్కడి ప్రజలకు అంటువ్యాధులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు అనేక దేశాలు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. చైనాకు వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, మాంసం ఆరగించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. చైనాకు వెళ్లేవారు, అక్కడ జలుబు, దగ్గులతో బాధపడేవారి వద్దకు వెళ్లవద్దని తెలిపింది.

చైనాకు వెళ్లివచ్చే వారు, లేదా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఢిల్లీ, కోల్‌కటా, ముంబై, చెన్నై, కోవై వంటి విమానాశ్రయాలలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. కోవై విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిగురించి కోవై ఆరోగ్యశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ కోవై విమానాశ్రయంలో వైద్యబృందం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఈ వ్యాధితో ఎవరూ రాలేదని వెల్లడిచారు.

>
మరిన్ని వార్తలు