కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. ఎన్నికల వేళ ఇన్‌ఛార్జ్‌ల మార్పు

23 Dec, 2023 20:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను ఏఐసీసీ మార్పు చేసింది. ఇక, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ను హైకమాండ్‌ మార్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షిని నియమించింది హైకమాండ్‌.

వివరాల ప్రకారం.. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ కీలక ప్రకటన చేసింది. 12 రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. తెలంగాణ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షి కొనసాగనున్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల సందర్బంగా మున్షి ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు. ఇక, మాణిక్‌రావ్‌ ఠాక్రేకు గోవా ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. అలాగే, ఏపీకి మాణిక్యం ఠాగూర్‌ను నియమిస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌ బాధ్యతల నుంచి ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం గమనార్హం. యూపీకి ప్రియాంక స్థానంలో అవినాశ్‌ పాండేను నియమించారు.

>
మరిన్ని వార్తలు