నేడు తీరం దాటనున్న ‘గజ’

15 Nov, 2018 09:51 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు వైపు దూసుకొస్తున్న గజ తుఫాన్‌ చెన్నైకి 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం సాయంత్రం కడలూరు, పంబన్‌ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని కడలూరు, నాగపట్నం, పుదక్కోట, తంజావూరు, తిరువారూరు, కారైకాల్‌, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎనిమిది జిల్లాల్లోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతేకాకుండా మధురై, రామేశ్వరం వైపు వెళ్లే పలు రైళ్లును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

దక్షిణ కోస్తాపై గజ తుఫాన్‌ ప్రభావం
గజ తూఫాన్‌ కారణంగా బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరగడంతో నెల్లూరు జిల్లాలోని మైపాడు, కోడూరుపాడు, తుమ్మలపెంలోకి సముద్ర  అలలు చొచ్చుకొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు చిత్తూరు జిల్లాలోని 30మండలాల్లో కూడా గజ తుపాన్‌ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు