నెతన్యాహును ఆ మోడల్‌లో చంపాలి : కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

19 Nov, 2023 11:02 IST|Sakshi

కొచ్చి: ఇజ్రాయెల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ నెతన్యాహుపై కేరళకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూపై న్యూరెంబర్గ్‌ మోడల్‌ వాడాలని కాసర్‌గడ్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌‌ వ్యాఖ్యానించారు. 


పాలస్తీనాలోని గాజాపై యుద్ద నేరానికి పాల్పడినందుకుగాను నెతన్యాహును ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపాలని రాజ్‌మోహన్‌ అన్నారు. కేరళలోని కాసర్‌గఢ్‌లో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. జెనీవా కన్వెన్షన్‌ కింద అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన వారిని ఇంతకంటే ఏం చేయాలని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.


ప్రస్తుతం ప్రపంచం ముందు యుద్ధ నేరస్తుడిగా నెతన్యాహు నిల్చున్నారని తెలిపారు. పాలస్తీనీయన్లపై పాల్పడ్డ అకృత్యాలకు అతడిని వెంటనే న్యూరెంబర్గ్‌ మోడల్‌లో అంతమొందించాల్సిందేనన్నారు. కాగా, న్యూరెంబర్గ్‌ మోడల్‌లో శిక్షలను హిట్లర్‌ ఆధ్వర్యంలోని నాజీలు ఎక్కువగా అమలు చేసేవారు. ఈ పద్ధతిలో యుద్ధ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపేశేవారు.

ఇదీచదవండి..కాంగ్రెస్‌ నేతలపై దాడి.. జ్యోతి పటేల్‌ సంచలన ఆరోపణలు

  
   

మరిన్ని వార్తలు