గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి

1 Mar, 2016 04:08 IST|Sakshi
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి

న్యూఢిల్లీ: దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే సాగరమాల ప్రాజెక్టు ద్వారా నౌకాయాన రంగంలో జలమార్గాలు, పోర్టు ఆధారిత ఆర్థికాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయ జలమార్గాల అభివృద్ధి కోసం రూ. 800 కోట్లు అందించామని...ఆ పనులను వేగవంతం చేశామని వివరించారు. 12 ప్రధాన పోర్టులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా కనీసం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలనుకుంటున్నామన్నారు. నౌకాయాన రంగంపై జైట్లీ పేర్కొన్న ఇతరాంశాలు..
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రధాన పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఇండియన్ కస్టమ్స్ సింగిల్ విండో ప్రాజెక్టు అమలు.
మరింత మంది దిగుమతిదారులకు డెరైక్ట్ పోర్టు డెలివరీ సౌకర్యం విస్తరణ.
కొన్ని తరగతుల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో వాయిదా సౌలభ్యం అందించేందుకు కస్టమ్స్ చట్టానికి సవరణ.

మరిన్ని వార్తలు