రక్తదానం చేసిన కుక్క

7 Jul, 2020 16:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : కుక్కలకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా కోల్‌కతాలో ఓ కుక్క మరో కుక్కకు రక్తదానం చేసి సూపర్‌ హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. డానీ అనే 13 ఏళ్ల పెంపుడు కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. దీంతో డానీ యజమానులు చికిత్స కోసం దానిని చెన్నై నుంచి కోల్‌కత్తాకు తీసుకొచ్చారు. అక్కడ నటుడు అనింద్య చటర్జీకి చెందిన సియా(కుక్క పేరు) డానీకి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడింది. 

ఇందుకు సంబంధించి అనింద్య మాట్లాడుతూ.. ‘సియా చాలా తెలివిగా రక్తదానం చేసింది. ఎటువంటి ఇబ్బంది పడకుండా పనిని పూర్తి చేసింది. ఇందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. సియా వల్ల నాకు ఈ రోజు గర్వంగా ఉంది. సియా డానీని కాపాడుకునేందుకు ఓ జంటకు సాయం చేసింది’ అని అన్నారు.(చదవండి : చనిపోయే ముందు అరచేతిపై రిజిస్ట్రేషన్‌ నంబర్‌)

‘డానీ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యతో బాధపడుతుంది. అందుకు చికిత్స అందించాలంటే రక్తం కావాల్సి వచ్చింది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రక్తదాతలు దొరకని పరిస్థితి. అలాగే కోల్‌కతాలో ఇలాంటి చికిత్స కొత్తది. కానీ డానీకి రక్తదాత లభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము’ అని వెటర్నరీ డాక్టర్‌ దేబాజిత్‌ రాయ్‌ తెలిపారు. కాగా, గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లను కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే కుక్క రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా