జయపురంలో ఎకో పార్క్‌  ఏర్పాటు   

11 Jul, 2018 13:17 IST|Sakshi
ఎకోపార్క్‌ ఏర్పాటుపై డీఎఫ్‌ఓతో చర్చిస్తున్న ఎంఎల్‌ఏ తారాప్రసాద్‌ బాహిణీపతి    

జయపురం: కొరాపుట్‌ జిల్లా జయపురం సమీపంలో గల నక్కిడొంగర పర్వత ప్రాంతంలో ఎకో–పార్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు  జయపురం ఎంఎల్‌ఏ తారాప్రసాద్‌ బాహిణీపతి, కొరాపుట్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ అ«ధికారి తో పాటు పలువురు అటవీ విభాగ అధికారులు జయపురంలోని పూర్ణగఢ్‌ సమీపంలోగల  నట్టిడొంగర పర్వత ప్రాంతంలో మంగళవారం పర్యటించి ఎకో–పార్క్‌ ఏర్పాటుకు తగిన ప్రాంతం కోసం  పరిశీలించారు.

ఈ ప్రాంతంలో రెండు కిలో మీటర్ల పరిధిలో ట్రాకింగ్‌ చేసేందుకు అనువుగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు సర్వ సాధారణ ప్రజలకోసం వ్యాయామశాల ఏర్పాటు చేయాలని, అలాగే ఉదయం, సాయంత్రం యోగా భ్యాసం చేసేందుకు అనువుగా ఎకో–పార్క్‌     ఏర్పాటు చేయాలని బావిస్తున్నారు.ఈ విషయమై డీఎçఫ్‌ఓతోను ఇతర అటవీ విభాగ అధికారులతోను ఎంఎల్‌ఏ తారాప్రసాద్‌ బాహిణీపతి  చర్చలు జరిపి తన  అభిప్రాయాలను తెలిపారు .

నక్కిడొంగర పర్వత ప్రాం తాంలో ఎకో–పార్క్‌ ఏర్పాటుతో పాటు దేశ విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువుగా నక్కిడొంగర పర్వత ప్రాంతాన్ని అందంగా తీర్చి దిద్దుతామని ఎంఎల్‌ఏ తారాప్రసాద్‌ బాహిణీపతి వెల్లడించారు. దీనిని ఒంక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలన్నది  తన అభిప్రాయమని తెలిపారు.

మరిన్ని వార్తలు