దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు

21 Jul, 2014 22:09 IST|Sakshi
దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు

లక్నో: మహిళలపై దాడులు, అత్యచార సంఘటనలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ తరహాలో ఆ రాష్ట్ర గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతటినీ మహిళల రక్షణ కోసం మోహరించినా అత్యాచారాలను ఆపలేరని ఖురేషీ అన్నారు.

ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఖురేషీ చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే దేవుడే దిగివచ్చి కాపాడాలని, లేకుంటే సాధ్యంకాదని ఖురేషీ అన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత పదవిలో ఉన్న ఖురేషీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు, దాడులతో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే.. ములయాం మాత్రం 21 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువేనని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు